15 June, 2026 | 7:44 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో ములుగు ఏసీపీ పుట్టినరోజు వేడుకలు

16-05-2026 01:51 AM

ఇల్లందు టౌన్, మే15, (విజయక్రాంతి):  నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో ములుగు ఏసీపీ ఈ. కిషోర్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ నేషనల్ చైర్మన్ మహమ్మద్ మొహినుద్దీన్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్తో పాటు వైద్య సిబ్బందిని శాలువాలతో సత్కరించి రోగులకు పండ్లు, శీతల పానీయాలు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఎన్హెచ్‌ఆర్సీ అండ్ డబ్ల్యూఈవో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అదేర్ల రాధాగోవిందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కాకటి సతీష్, కనుకుల సత్యం, డేరంగుల శంకర్, మహిళా విభాగం ఇల్లందు మండల అధ్యక్షురాలు మొకాళ్ల శిరీష, కమటం వైశాలి, రాజమున్నూరు విజయ, పామర్తి శ్రావణి, యలగందుల లావణ్య, కుంజా హేమలత, ఖమ్మం జిల్లా కార్యదర్శి మదగాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.