తాగునీటి కష్టాలు గోరుకొండ ఆదివాసుల సమస్యలు పట్టించుకోని
- పంచాయతీ అధికారులు, పాలకవర్గం
- మాజీ సర్పంచ్ కారం కన్నరావు నిరసన
చర్ల, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : వేసవి తీవ్రతతో మండలంలో తాగునీటి కష్టాలు పెరిగాయి. నీటి మట్టాలు అడుగంటడంతో, కొన్ని గ్రామాల్లో, నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లు ఎండిపోవడంతో ప్రజలు కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకుంటున్నారు. మరి ముఖ్యంగా మారుమూల అటవీ ప్రాంతమైన చర్లమండల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామం అయినటువంటి తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలోని గోరుకొండ గ్రామంలో గత మూడు వారాలుగా తాగునీరు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
అధికారులకు మరియు పాలకవర్గం కి చెప్పిన ఎటువంటి ఉపయోగం లేదు అందువల్ల శుక్రవారం మాజీ సర్పంచ్ కారం కన్నరావు ఆధ్వర్యంలో గోరుకొండ వాటర్ ట్యాంక్ వద్ద నున్న రోడ్ పై ధర్నా నిర్వహించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే గ్రామానికి త్రాగునీరు అందించాలి అని నిరసన తెలియచేశారు అధికారి తక్షణం స్పందించకపోతే ఐటిడిఎ పీ ఓ కార్యాలయం ముందు ధర్నాకు కూడా సిద్ధమవుతం అని తెలియచేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్న ముస్కీ భీమా ముస్కీ దేవ పోడియం దేవ కలము లక్మ మాదివీ దుల్లయ్య గట్టుపల్లి రాజు మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు






