సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని వాజేడు ఎస్ఐ ఆత్మహత్య
02-12-2024 09:46 AM
హైదరాబాద్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ముళ్లకట్ట సమీపంలోని రిసార్ట్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసుల తెలిపారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిన రాత్రే హరీశ్ ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. ఆయన సూసైడ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు హరీశ్ ఆత్మహత్యకు ఉన్నాతాధికారులు వేదింపులే కారణమని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.




