calender_icon.png 6 December, 2024 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతా

15-07-2024 01:39:12 AM

  1. సమష్టిగా పనిచేస్తేనేప్రగతి సాధించగలం

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క

జయశంకర్ భూపాలపల్లి (ములుగు), జూలై 14 (విజయక్రాంతి): ములుగు జిల్లా ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.  ఎంపీ బలరాంనాయక్‌కు ఆయన స్వగ్రామమైన ములుగు జిల్లాలోని మదన్‌పల్లిలో ఆదివారం నిర్వహించిన ఆత్మీ య సన్మాన సభలో మంత్రి మాట్లాడారు. బలరాం నాయక్ మంచి ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు పొందారని, మొన్నటి వర కు ఆయనకు అధికారం లేకపోయినా ప్రజల మధ్యే ఉన్నారని గుర్తుచేశారు.

స్వగ్రామ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎంపీతో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేసి జిల్లాను అభి వృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యో గులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.