8 July, 2026 | 3:44 AM

బిలియనీర్ల ముంబై

14-05-2024 12:47 AM

శ్రీమంతుల సంఖ్యలో బీజింగ్‌ను మించిన నగరం

ముంబై, మే 13 : దేశంలో ఫైనాన్షియల్ హబ్‌గా పేరొందిన ముంబై ఆసియాలోనే బిలియనీర్ల కేంద్రస్థానంగా అవతరించింది. తాజాగా విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్‌లిస్ట్ ప్రకారం శ్రీమంతుల సంఖ్యలో చైనాలోని బీజింగ్ నగరాన్ని ముంబై మించిపోయింది. ప్రస్తుతం ముంబై 92 మంది బిలియనీర్లతో ఆసియాలో అగ్రస్థానంలోనే ఉండగా, 91 మంది బిలియనీర్లతో బీజింగ్ ద్వితీయస్థానానికి పరిమితమయ్యింది. 2024 హురున్ జాబితాలో ముంబైలో కొత్తగా 26 మంది బిలియనీర్లు ఆవిర్భవించగా, బీజింగ్ 18 మందిని కోల్పోయింది. అంతర్జాతీయంగా న్యూయార్క్, లండన్‌ల తర్వాత తృతీయ బిలియనీర్ల రాజధానిగా ముంబై అవతరించింది. న్యూయార్క్‌లో 119 మంది, లండన్‌లో 97 మంది బిలియనీర్లు ఉన్నారని హురున్ వెల్లడించింది. న్యూఢిల్లీ తొలిసారిగా టాప్ వచ్చింది. 

మూడోస్థానంలో భారత్ 

ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్యలో 271 మంది కుబేరులతో భారత్ మూడోస్థానంలోకి చేరింది. ప్రపంచంలో ప్రస్తుతం 3,279 మంది బిలియనీర్లు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 155 మంది బిలియనీర్ల స్థానం నుంచి తప్పుకున్నప్పటికీ, మొత్తం 814 మందితో ఈ ఏడాది కూడా చైనా అగ్రస్థానంలోనే ఉన్నది. 800 మంది తో యుఎస్ ద్వితీయస్థానంలోనూ ఉన్నా యి. భారత్‌లో కొత్తగా 84 మంది బిలియ నీర్లు అవతరించగా, మొత్తం 271మందితో దేశం తృతీయస్థానంలో ఉన్నది. అటు తర్వాత అధిక సంఖ్యలో బిలియనీర్లు కలిగిన దేశాలు యూకే, జర్మనీ, స్విట్జర్లాండ్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్‌లు.