13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

భారత టీటీ కోచ్‌గా సోమ్‌నాథ్ ఘోష్

31-03-2026 12:51 AM

హైదరాబాద్, మార్చి 30 : హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ కోచ్ సోమ్‌నాథ్ ఘోష్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆటగాడిగా పలు అద్భుత విజయాలు సాధించి ప్రస్తుతం భవిష్యత్తు ప్లేయర్స్‌ను తీర్చిదిద్దుతున్న ఘోష్ భారత టేబుల్ టెన్నిస్ కోచ్‌గా ఎంపికయ్యాడు. మకావులో జరుగుతున్న ఐటీటీఎఫ్ పురుషుల,మహిళల టీటీ ప్రపంచకప్‌లో భారత జట్టుకు సోమ్‌నాథ్ ఘోష్ కోచ్ గా వ్యవహరించనున్నాడు.

అలాగే లండన్ వేదికగా ఏప్రిల్ 28 నుంచి జరిగే ఐటీటీఎఫ్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌కు సై తం కోచ్‌గా ఎంపికయ్యాడు. దీనిపై సోమ్‌నాథ్ ఘోష్ సంతోషం వ్యక్తం చేశాడు. రెం డు పెద్ద టోర్నీల్లో భారత జట్టుకు కోచ్‌గా ఎంపికవడం తన బాధ్యతను మరింత పెం చిందన్నాడు. తాను కోచింగ్ ఇస్తున్న శ్రీజ ఆ కుల కూడా కీలక ప్లేయర్‌గా జట్టులో ఉండడంపైనా హర్షం వ్యక్తం చేశాడు. ఈ సంద ర్భంగా టీటీఎఫ్‌ఐతో పాటు తెలంగాణ స్టేట్ టీటీ అసోసియేషన్లకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా టీటీ ప్రపంచకప్ ఏప్రిల్ 5 వరకూ జ రుగుతుంది.