11 April, 2026 | 4:10 AM

11వ వార్డ్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

11-04-2026 02:24 AM

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 10,(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్ లో కొనసాగుతున్న సిసి రోడ్ నిర్మాణ పనులను శుక్రవారం నాడు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

పురపాలక సంఘ ఎన్నికలకు ముందు 11వ వార్డు ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును అడిగిన వెంటనే సిసి రోడ్ మంజూరు చేయిస్తానని ఇచ్చిన మాట ప్రకారం 3నెలల గడవకముందే సిసి రోడ్ మంజూరు చేయించారన్నారు. నిర్మాణ పనుల్లో ఎటువంటి నాణ్యత లోపం లేకుండా చూడాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సాయిరాం కౌన్సిలర్లు తిరుపతి, గఫర్,శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ గౌడ్, శ్యామ్, రఫిక్ గ్రామస్తులు కిషన్, సాయిలు,సిద్దు,రాములు, రవి తదితరులు పాల్గొన్నారు.