10 June, 2026 | 1:33 AM

సెలవుపై వెళ్లిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత

10-06-2026 12:15 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 9, (విజయక్రాంతి):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత దీర్ఘకాలిక సెలవు పై వెళ్లారు. ఆమె స్థానంలో డిప్యూటీ కమిషనర్ విజయానంద్ కు కమిషనర్ గా అదనపు బాధ్యతలు ఇస్తూ డి ఎం ఏ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆయన మంగళవారం బాధ్యతల స్వీకరించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సాధన సమావేశంలో ఆమె పని తీరుపై కార్పొరేటర్లు సైతం మండిపడటం, ఆమె చుట్టూ నలుగురు వ్యక్తులు ఉంటారని, ప్రజా ప్రతినిధుల మైన తమను కలిసేందుకు కూడా వారు సహకరించారని బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. అభివృద్ధి పనుల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణ నేపథ్యంలో ఆమె సెలవు పై వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.