24 June, 2026 | 12:15 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

గ్యాస్ బుకింగ్ గడువు పెంపు

25-03-2026 01:44 AM

రెండు సిలిండర్లు ఉంటే 35 రోజుల గడువు

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును మరింత పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రెండు సిలిండర్లు ఉంటే బుకింగ్ మధ్య అంతరం కనీసం 35 రోజులు ఉండాలని ప్రకటించాయి. మొదట్లో 21 రోజులు ఉండగా మార్చి రెండో వారంలో 25 రోజులకు, తాజాగా 35 రోజులకు పెంచడం గమనార్హం. సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజుల అంతరం తర్వాతే బుక్ చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (పీఎంయూవై) వినియోగదారులకు సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజులకు పెంచారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.