20 April, 2026 | 6:07 PM

కోతి చేష్టలకు ఇక చెల్లు

20-04-2026 04:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో కోతి చేష్టలకు ఇక సెల్లు పడనుంది. నిర్మల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ప్రజలను బెంబేలెత్తిస్తున్న కోతులను నియంత్రణపై మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో దృష్టి పెట్టింది. పట్టణంలో ప్రత్యేక సిబ్బందిని తీసుకొచ్చి కోతులను పట్టుకొని సమీప అడవిలోకి వదిలిపెట్టే కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి సోమవారం ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది కౌన్సిలర్లు పాల్గొన్నారు.