09-02-2026 04:25:58 PM
జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల పక్రియ సాఫీగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఎన్నికల అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగనున్న నాలుగు మున్సిపాలిటీ ఎన్నికలు సాఫీగా జరగాలన్నారు.
ఏవైనా ఎన్నికల నిర్వహణ పనులు పూర్తి కాకపోతే ఈ రోజు పూర్తి చేసి,రేపు ఉదయం 9 గంటల వరకు ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి మార్గనిర్దేశనం చేయాలన్నారు. ఆర్వోలు, జోనల్ అధికారులు ఎన్నికల వస్తూ సామాగ్రిని పరిశీలించుకొని, పోలీస్ సంబంధిత ఎస్కార్ట్ వాహనంతో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరాలన్నారు.
పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన పోలింగ్ సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం నియమాలను అనుసరించి పత్రాలను నింపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.