9 May, 2026 | 5:35 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు

15-09-2025 09:31 PM

అర్మూర్,(విజయక్రాంతి): అర్మూర్ మున్సిపల్ పరిధిలోని బేకరీలు, స్వీట్ దుకాణాల్లో సోమవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రతను పాటించకుండా ఫ్రీజ్ లలో కొంత కాలంగా నిలువ ఉంచుకున్నటువంటి తిను బండారాలు, మాంసం నిల్వలను పరిశీలించారు.  ఢిల్లీ స్వీట్ హోమ్, అనూ బేకరీ, డాల్ఫిన్ బేకరీ,  వినాయక బెస్ట్ బేకరీ తదితర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో   ఫంగస్ వచ్చినటువంటి బెడ్స్ డేట్ అయిపోయిన కూల్ డ్రింక్స్, ఇతర తినుబండారాలను  గుర్తించారు. అధికారులు యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు దుకాణ యజమానులకు జరిమానాలు విధించారు. పరిశుభ్రంగా ఉంచాలని, పాడైపోయిన వాటిని పడేయాలని సూచించారు. కాలం చెల్లిన తినుబండారాలను అమ్మ వద్దని సూచించారు.  ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేయాలని కోరారు.