calender_icon.png 15 September, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ధి చేయాలి... సీజనల్ వ్యాధులను నివారించాలి

15-09-2025 09:26:51 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రగతిశీల యువజన సంఘం (పి.వై.ఎల్) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు మారుజొడు సిద్దేశ్వర్  అధ్యక్షతన ఆలేరు పట్టణ కేంద్రంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో PYL రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ పాల్గొని మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమైందని, సీజనల్ వ్యాధులు ప్రబలి గ్రామాలు దళిత వాడల ప్రజలు తీవ్ర విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, రోగాలతో పేద ప్రజలు గోస పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు లేవని.  ఖాళీగా ఉన్న డాక్టర్స్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

టెండర్ల ప్రభుత్వ ఆస్పత్రులలో కనీస సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తే విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోగులకు అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలని గుండె బ్రెయిన్ లివర్ కిడ్నీ లంగ్స్ లాంటి తదితర జబ్బులకు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరైన వైద్యం అందగా సాధారణ ప్రజలు సైతం ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తే విచ్చలవిడిగా డబ్బులు దండుకుంటున్నారని, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నొస్టిక్ సెంటర్స్ విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నాయని, వీటిని నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు.

వర్షాకాలం రావడంతో విష సర్పాలు సంచరిస్తాయని, పాము కాటుకు, కుక్క కాటుకు గురైన వారికి తక్షణమే వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, జిల్లా వైద్యశాలలో ఖాళీగా ఉన్న డాక్టర్స్, నర్సు, తదితర సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని, ఆలేరు నియోజకవర్గం పట్టణ కేంద్రంలోని 100 పడకల హాస్పిటల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 25 ,26న పి వై ఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో లాల్ బంగ్లాలో జరుగుతున్నాయి, ఈ శిక్షణ తరగతులను యువతి, యువకులు జయప్రదం చేయాలని కోరారు.