15-09-2025 09:35:40 PM
ఆర్మూర్,(విజయక్రాంతి): పెండింగ్ ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పి.డి.ఎస్.యు. జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్ డిమాండ్ చేశాడు. సోమవారం. ఆర్మూర్ పట్టణంలో పెండింగ్ బకాయిలు విడుదలకై యాజమాన్యాలు చేపట్టిన బంద్ కు పి.డి.ఎస్.యు. ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8500 కోట్ల రూపాయలపై రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నందున విద్యార్థులకు ఉన్నత స్థాయి చదువుకు వెళ్లే ఆటంకం కలుగుతుందని వాపోయాడు.
చదువు పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్ లేక ఉన్నత చదువు చదవలేక రోడ్లమీద తిరుగుతున్నారని అన్నారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు గుర్తు చేశారు. అదేవిధంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేయొద్దని కోరారు. వారి సమస్యను పరిష్కారం చేయాలని వెంటనే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులతో సెక్రెటరీయేట్, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలల యజమాన్యాలు చేపట్టిన కళాశాలలు బందును పి.డి.ఎస్.యు. సంపూర్ణంగా మద్దతును చేస్తుందని అన్నారు.