23 June, 2026 | 2:30 AM

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

23-06-2026 12:30 AM

మేడ్చల్, జూన్ 22(విజయ క్రాంతి): మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్, సిఐటియు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జే చంద్రశేఖర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ పర్మినెంట్ చేయడం లేదని, కనీస వేతనాలు అమలు చేయడం లేదని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం లేదన్నారు.

కొన్ని మున్సిపాలిటీలలో అనేక నెలలోగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, రెండవ పిఆర్సి లో కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించాలని, మరణించిన కార్మికుల దహన సంస్కారాలకు 30 వేల రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ఉన్నికృష్ణన్, ఆరోగ్యం, ముత్యాలు, సుధాకర్, రవి ప్రశాంత్, సుగుణ, శ్రీను, బిక్షపతి, నవనీత తదితరులు పాల్గొన్నారు.