10 August, 2026 | 3:40 PM

యువకుడి హత్య

26-05-2024 01:08 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 25 (విజయక్రాంతి): జిల్లాలోని చింతలమానేపల్లి మండలం కోర్సిని గ్రామానికి చెందిన బొట్టుపల్లి సదయ్య (30) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  సదయ్య శుక్రవారం రాత్రి గ్రామంలోని పెంటుబాయి అనే మహిళ ఇంటికి వెళ్లడంతో.. ఆమె కొడుకు రాజ్‌కుమార్ తమ ఇంటికి ఎందుకు వచ్చావని సదయ్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో రాడ్డుతో సదయ్యపై రాజ్‌కుమార్ దాడి చేశాడు. దీంతో తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి మల్లక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.