04-09-2025 01:02:32 AM
-రూ. 2 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పు
- నిందితునికి శిక్షపడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన ఎస్‌పీ
కామారెడ్డి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదీ విధించడంతో పాటు రెండు వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్ బుధవారం కామారెడ్డి కోర్టులో తీర్పు వెలువరించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం మేనూరు గ్రామానికి చెందిన లక్ష్మణ్ గొండ (60) జూలై 20న రుణమాఫీ డబ్బులు తెచ్చుకునేందుకు బ్యాంకుకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాలేదు.
అతని కుమారుడు బరిగే అశోక్ ఫోన్‌చేస్తే స్విచాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా బరిగే లక్ష్మణ్ గుండా సాలబత్పూర్ శివాలు లైవ్ ఓవర్ బ్రిడ్జి పక్కన హైవే సర్వీస్ రోడ్ సమీపంలో మృత దేహం పడి ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో మృతిని బంధువులకు సమాచారం అందిం చారు. మృతుని కుమారుడు బరిగే అశోక్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి చూడగా తన తండ్రి మృతదేహం గా గుర్తించాడు. లక్ష్మణ్ గొండ ఒంటిపై కన్ను పక్కన గాయాలు ఉన్నాయి.
అతని వద్ద ఉన్న డబ్బులను తీసుకొని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సలా బాత్ పూర్ గ్రామానికి రపన్ వాడ సాయిలు డబ్బులు తీసుకొని హత్య చేసినట్లుగా గుర్తించిన పోలీసులు విచారించగా నిందితుడు డబ్బులు తీసుకొని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. మద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన నిందితున్ని కోర్టుకు హాజరు పరిచారు. వాదనలు విన్న కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి వర ప్రసాద్ నిందితుడు సాయిల్ కు జీవిత ఖైదు విధించడంతో రెండు వేల జరిమానా విధించినట్లు ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు.
నేరం చేసిన వానికి శిక్ష తప్పదని ఆయన తెలిపారు. ఈ కేసులో పోలీస్ తరఫున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్ గౌడ్, ఈ కేసును సరియోగ పద్ధతిలో విచారణ చేసిన అప్పటి బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్, ప్రస్తుత బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, మద్నూర్ ఎస్త్స్ర విజయ్ కొండ, హెడ్ కానిస్టేబుల్ సాయన్న, కోర్టు లిజనింగ్ ఆఫీసర్ రాజయ్య, ఏఎస్‌ఐ రామేశ్వర్ రెడ్డి, సీడీవో శ్రీకాంత్ లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.