calender_icon.png 11 September, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పచ్చదనం, పరిశుభ్రత అందరి బాధ్యత

04-09-2025 01:01:55 AM

గురుమూర్తి నగర్ గణేష్ టెంపుల్లో చెట్ల నాటిల్లు కార్యక్రమం

సనత్‌నగర్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): గురుమూర్తి నగర్ గణేష్ ఆలయం లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల నాటిల్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ శ్రీనివాస్, సభ్యులు విచ్చలయ్య, అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, కూతురు నరసింహ, పూజారి పరమేశ్వర్ పాల్గొని మొక్కలు నాటారు.అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి మాట్లాడుతూ ‘సమాజానికి పచ్చదనం, పరిశుభ్రత అందించ డం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావా లి. చెట్ల సంరక్షణతోనే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు.

ఇలాంటి సేవా కార్య క్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా ను‘ అని తెలిపారు. మాజీ చైర్మన్ శ్రీనివాస్, సభ్యులు విచ్చలయ్య మాట్లాడుతూ ‘గణేష్ ఆలయ పరిసరాలను పచ్చదనం కప్పేలా మరిన్ని మొక్కలు నాటే కార్యక్రమాలను నిరంతరం చేపడతాం. సమాజంలోని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి‘ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, యువత, ఆలయ భక్తులు చురుకుగా పాల్గొని చెట్లు నాటడమే కాకుం డా, వాటికి తగిన సంరక్షణ కల్పించేందుకు ప్రతిజ్ఞ చేశారు.