హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు
10-12-2024 01:37 AM
రాజేంద్రనగర్, డిసెంబర్ 9: హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించినట్లు అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ వెంకటరామిరెడ్డి వెల్లడించారు. వివరాలు.. అత్తాపూర్ పీఎస్ పరిధిలోని రామ్‌భాగ్‌లో బీదర్ ప్రాంతానికి చెందిన వివాహిత జ్యోతి (35) హౌస్ మెయిడ్‌గా పనిచేస్తోంది.
ఆమె 2019, నవంబర్ 7 న హత్యకు గురైంది. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసి ఆధారాలు సమర్పించారు. ఎల్పీనగర్ లో ని అడిషనల్ జిల్లా జడ్జి కవిత కేసు పూర్వాపరాలు పరిశీలించి నిం దితుడు శ్రీకాంత్(30)కు జీవిత ఖైదుతోపాటు 3 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించించారు.






