05-12-2024 02:43:48 AM
* 16న పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరు కావాలి
* హిట్ అండ్ రన్ కేసులో రాహిల్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 4(విజయక్రాంతి): ప్రజాభవన్ వద్ద హిట్ అండ్ రన్‌కు పాల్పడిన కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ విచారణకు కా వాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఎక్కడు న్నా ఈ నెల 16న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఢీకొట్టిన ఘటనలో రాహిల్‌పై పంజాగుట్ట పోలీసులు 2023లో కేసు న మోదు చేసిన విషయం తెలిసిందే. కేసు న మోదు తర్వాత నిందితుడు దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, పోలీసులు కఠిన చర్యలు తీ సుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కో రుతూ హైకోర్టులో రాహిల్ ఏప్రిల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయ మూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. కేసు విచారణలో దర్యాప్తు అధికారులకు సహకరించాలని రా హిల్‌కు తేల్చిచెప్పారు. గతంలో హాజరు కా వాలని చెప్పినా పాటించకపోవడంపై మందలిస్తూ, పిటిషన్ విచారణ ముగించారు.