calender_icon.png 22 August, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా దాన కిశోర్

05-12-2024 02:38:47 AM

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): పాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రిన్సిపల్ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ దాన కిశ్‌ర్‌ను నియమిస్తూ ఆయనకు అదనపు బాధ్యతలను కట్టబెట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా దాన కిశోర్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రె టరీగా బుర్రా వెంకటేశం వ్యవహరించారు.