29-04-2025 12:00:00 AM
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట ఏప్రిల్ 28: తాను తుది శ్వాస విడిచే దాకా అచ్చంపేట అభివృద్ధి ప్రధాన లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తన సతీమణి అనురాధ అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన అనంతరం కోలుకొని మొదటిసారి అచ్చంపేట నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మొదటగా మైసిగండి, రంగాపూర్ లోని షావలిన్ దర్గా, ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తన మీద ఉన్న అభిమానంతో భారీ మెజార్టీతో గెలిపించిన అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఎస్‌ఎల్బిసి టర్నల్ వద్ద 12 రోజులపాటు పనిచేయడం ద్వారా కొంతమేర తన ఆరోగ్య పరిస్థితి పట్ల అనుమానం వేసి పరీక్షలు జరిపించుకోవడం జరిగిందన్నారు.
గుండెలో రెండు బ్లాకులకు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందన్నారు. నల్లమల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహ సహాయ సహకారాలు మరువలేనివన్నారు. ప్రజా దీవెనలే తనను బతికించాయన్నారు.