calender_icon.png 1 May, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యలను పరిష్కరించేందుకు

29-04-2025 12:00:00 AM

గద్వాల, ఏప్రిల్ 28 ( విజయక్రాంతి ) : భూభారతి ద్వారా నిర్దిష్ట గడువులో రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు.సోమవారం రాజోలి మండలంలోని రైతు వేదికలో భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు,చట్టం వివరాలను వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టం ద్వారా రైతు భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రతి రైతు ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ధరణి చట్టం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా సమగ్ర అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని తెలిపారు.మేధావులు, అధికారులు అధ్యయనం చేసి,డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రారంభించిందని తెలిపారు.

కొత్త చట్టం ద్వారా లావాదేవీలు,భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు,అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్, సాదా బైనామాల సమస్యలు, సరిహద్దు వివాదాలు, వారసత్వ మార్పులు వంటి సేవలను వేగంగా పూర్తి చేసే విధానం రూపొందించామన్నారు.సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం సమగ్ర రూపంలో తెచ్చిన భూ భారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పలువురి అనుమానాలు,సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనువాసులు, అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ దొడప్ప, రాజోలి తహసీల్దార్ రామ్ మోహన్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కుమార్, ఎంపీడీఓ ఖాజా మొహినుద్దీన్, మండల వ్యవసాయాధికారి సురేఖ, వివిధ శాఖల అధికారులు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.