07-09-2025 01:22:51 AM
-నాపై పనిగట్టుకుని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారు
-వారి విజ్ఞతకే వదిలేస్తున్నా
-దిగజారుడు రాజకీయాలు మంచిది కాదు
-మాజీ మంత్రి హరీశ్‌రావు
రంగారెడ్డి, సెప్టెంబర్ 6 ( విజయక్రాంతి): ఉద్యమం నుంచి ౨౫ ఏళ్లుగా తన జీవితం తెరచిన పుస్తకమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇటీవల తనపైన, పార్టీపైన కొందరు ఆరోపణలు చేశారని, అయితే అవి ఎందుకు చేశారో, ఎవరి లబ్ధి కోసం చేశారో వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు తొలిసారిగా స్పందించారు. యూకే పర్యటన ముగించుకుని శనివారం తెల్లవారుజామున శంషాబా ద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
నాపై పనిగట్టుకుని కొందరు దుష్ర్ప చారం చేసినంత మా త్రాన అబద్ధం నిజం అవుతుందా అంటూ పరోక్షంగా ఎమ్మెల్సీ కవితకు ఆయన కౌం టర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ర్ట సాధన నుం చి పునర్నిర్మాణం వరకు తన నిబద్ధత, నిజాయితీ, నా రాజకీయ జీవితం ప్రజలకు తెలు సన్నారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలు, వివిధ పార్టీల నాయకులు గతంలో తనపై చే సిన పొలిటికల్ కామెంట్లు, ఆరోపణలనే కవిత చేశారని అందులో కొత్త విషయం ఏ మీ లేదని ఆయన సమాధానం చెప్పారు.
ఇటీవల ఎవరు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారో... పనిగట్టుకొని బీఆర్‌ఎస్ పారీ పై, తనపై చేసిన ఆరోపణలో వారికి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఏమిటో తనకర్థం కావడం లేదని చెప్పారు.. పనిగట్టుకొని దు ష్ర్పచారం చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోతాయా అని ఆయన ప్ర శ్నించారు. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న వారి విజ్ఞతకే తాను వదిలేస్తున్నానని ఆయన కౌంటర్ ఇచ్చారు.
రాష్ర్టంలో ఒకపక్క రైతులు యూరియా కొరతతో అల్లాడు తుంటే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి అవలంభిస్తున్న ప్ర జా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎం డగట్టేందుకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున తా ము పోరాటాలు చేసేందుకు సిద్ధమని చె ప్పారు.