07-09-2025 01:23:37 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ ప్రారంభించే దశలో ఉండగా, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ పర్యటనలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైయ్యారు. కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తునకు రాష్ర్ట ప్రభుత్వం అభ్యర్థించగా, దక్షిణాది రాష్ట్రాల జాయింట్ డైరెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించాల్సి ఉంది.
శనివారం మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల మధ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ సమావేశాన్ని తలపెట్టారు. అయితే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వా మి దర్శనం చేసుకున్నారు. శనివారం ఉద యం శ్రీశైలం నుంచి తిరిగివస్తుండగా ఆయ న ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను జూబ్లీహి ల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికి త్స అందిస్తున్నారు.
ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీ శారు. అయితే జ స్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించ గా, తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్య లు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జా రీ అయ్యాయి.
సీబీఐ డైరెక్టర్ న్యాయ బృం దంతో కలిసి కోర్టు ఆదేశాలపై, ఎఫ్‌ఐఆర్ దాఖలుపై చర్చించాల్సి ఉంది. ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో సమావేశం వాయిదా పడే అవకాశం ఉందని, కాళేశ్వరం దర్యాప్తు ప్రక్రియ ప్రా రంభం జాప్యం కావచ్చని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.