07-09-2025 01:20:56 AM
-శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
-రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్లలో 5వ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలక్షన్స్ ప్రారంభం
కోనరావుపేట, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మండలం మర్రిమడ్ల నందు గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 5వ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలక్షన్స్‌ను శనివారం సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌కుమార్ ప్రారంభించారు. ఈఎంఆర్‌ఎస్ క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. మంత్రి స్థాయిలో నేడు కోనరావుపేట మండలంలో జరుగుతున్న ఈఎంఆర్ ఎస్ క్రీడా పోటీలకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తక్కువ సమయంలో క్రీడ పోటీల నిర్వహణకు మంచి ఏర్పాటు చేసిన అధికారులను సిబ్బందిని మంత్రి అభినందించారు. రాష్ర్ట నలుమూలల నుంచి నేడు 1200 మంది పైగా విద్యార్థులకు క్రీడా పోటీలు జరుగుతున్నాయని అన్నారు. ఇండోర్, ఔట్ డోర్ క్రీడా పోటీలను ప్రణాళిక ప్రకారం పక్కగా నిర్వహించాలని అన్నారు.
పిల్లలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్రీడా పోటీలు నిర్వహించాలని అన్నారు. నిబంధనల ప్రకారం పోటీలు నిర్వహించాలని అన్నారు. ఏకలవ్య పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని , తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత 740 కోట్ల రూపాయలు గిరిజన గ్రామ పంచాయతీలకు విడుదల చేశామని అన్నారు. చిన్నారులలో ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.
ఈఎంఆర్‌ఎస్ క్రీడా పోటీలలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి ముందుకు పోవాలని అన్నారు. క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని అన్నారు. క్రీడాకారులకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత అందిస్తుందని అన్నారు. వేములవాడ నియోజకవర్గం లోని గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మా ణానికి ప్రతిపాదనలు పంపామని, మనకు 9 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు మంత్రి వర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.