17 August, 2026 | 2:40 AM

నాచగిరికి శ్రావణ శోభ

17-08-2026 12:50 AM

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి

గజ్వేల్, ఆగస్టు 16: శ్రావణమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టలోని శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి సన్నిధిలో  37 సత్యనారాయణ స్వామి వ్రతాలు, 6 నిజాభిషేకాలు, 4 స్వామివారి కల్యాణాలు భక్తులచే నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బి. రంగాచారి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.