17 August, 2026 | 5:39 AM

యువత స్వశక్తితో ఎదగాలి

17-08-2026 12:50 AM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

మొయినాబాద్ ఆగస్టు 16(విజయ క్రాంతి): యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఎదగాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్ చౌరస్తాలోని క్రిసెంట్ ఎనర్జీ సౌర శక్తి సంస్థను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు రీసెంట్ ఎనర్జీ యజమాన్యం కాజా మొహినిద్దీన్, మహమూద్ మోహినిద్దీన్లు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన సోలార్ ప్లాంట్లను అందజేయాలని అన్నారు. సోలార్ వినియోగం ద్వారా నివాస వాణిజ్య సంస్థలకు తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుందని తెలిపారు. సోలార్ వినియోగిస్తే విద్యుత్ బిల్లులు తక్కువగా వస్తాయని సూచించారు. వ్యాపార సంస్థలకు సోలార్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వినియోగదారులకు సరసమైన ధరలు అందించాలని యజమానులకు సూచించారు.

సోలార్ వినియోగం ద్వారా పర్యా వరణ అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుత్బుద్దీన్ గూడా సర్పంచ్ మహమ్మద్ పాషా, మౌలానా అబ్దుల్ కలాం యూత్ అధ్యక్షుడు మహమ్మద్ హాజీ, ఉపాధ్యక్షుడు ముస్తఫా, మాజీ అధ్యక్షుడు కరీం భాయ్, మాజీ ఉపాధ్యక్షుడు రహమత్, నాయకులు రవీందర్, మహమ్మద్ జావిద్, అతిక్, యాసిన్, ఇబ్రాహీం, మేరజ్, తదితరులు పాల్గొన్నారు.