17 April, 2026 | 2:43 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నాగ్.. చింతిస్తున్నా!

13-11-2025 12:00 AM

వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానన్న మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో తను చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి మంత్రి ఒక పోస్ట్ పెట్టారు. ‘నాగార్జున, ఆయన కుటుంబాన్ని బాధపెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బంది పెట్టాలని కాని, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది నా ఉద్దేశం కాదు.

నేను చేనిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్న’. అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే మంత్రి సురేఖ ఇలా రియాక్ట్ అయినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఇప్పటికే మంత్రి సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే.