calender_icon.png 1 May, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగలిగిద్ద జడ్పిహెచ్ఎస్ పాఠశాల 100% ఉత్తీర్ణత

30-04-2025 08:38:09 PM

నాగల్ గిద్ద: మార్చ్ 2025 ఎస్ఎస్సి ఫలితాలలో జడ్.పి.హెచ్.ఎస్ నాగల్ గిద్ద విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని, 500 మార్కులకు పైగా 20 మంది విద్యార్థులు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శంకర్ తెలియజేశారు. ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందం జ్యోతి, మారుతి, విజయేందర్ రెడ్డి, కాశీరాం, మల్లేశ్వరి, శివశంకర్ లకు, విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు, మాపై విశ్వాసం ఉంచి మా పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని గ్రామస్తులను కోరారు.