calender_icon.png 8 July, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంచం లేదంటే.. లే‘అవుట్’!

08-07-2025 12:46:34 AM

- ప్రాజెక్టుల అనుమతులకు.. అధికారుల చేతులు భారీగా తడపాల్సిందే

- గతంతో పోల్చితే ఆమ్యామ్యాలను 150 శాతం పెంచిన అధికారులు

- న్యాయం చెయ్యాలంటూ వెళితే.. ప్రజాప్రతినిధి ‘మామూలు’ హుకుం

- లబోదిబోమంటూ ప్రాజెక్టులనే వదులుకుంటున్న బిల్డర్లు

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి) : రోజురోజుకు పురోగమించాల్సిన రియల్‌ఎస్టేట్ రంగం కొద్ది కాలంగా స్తబ్దుగా మారింది. రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లు తమ శక్తికొద్దీ పెట్టుబడులు పెట్టి ఏదైనా ప్రాజెక్టును ప్రారంభించినా.. అటు అధికారులు, ఇటు రాజకీయ నేతల మధ్య బిల్డర్లు ‘మామూళ్లు’ చెల్లించలేక కొట్టుమిట్టాడుతున్నారు.

చేపట్టిన ప్రాజెక్టులకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన అనుమతులు కూడా రావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు భారీగా చేతులు తడపాల్సి రావడంతో.. బిల్డర్లు.. మధ్యలోనే ప్రాజెక్టులను వదిలేసుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. వెరసి తెలంగాణ రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్ బిల్డర్స్ త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు.

తాజాగా క్షేత్రస్థాయిలో ఒక బిల్డర్ స్వీయ అనుభవం ఇది.. భారీ లంచాలను చెల్లించలేక.. ప్రాజెక్టుకు అనుమతులు రాక.. నీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకో దండంరా బాబూ.. అనుకుం టూ.. ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసిన సదరు బిల్డరు మనో వ్యధ ఇది..!

గత ప్రభుత్వంతో పోల్చుకుంటే.. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్ రంగం 

 తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రా జెక్టులను అభివృద్ధి చేసేందుకు బిల్డర్లు భారీ మొత్తంలో వెచ్చించి, వినియోగదారుల నుం చి అడ్వాన్సులుగా సేకరించిన తరువాత.. అధికారులు, రాజకీయ నేతల వ్యవహారం కారణంగా ప్రాజెక్టులను మధ్యలోనే నిలిపివేయాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఇందుకు నా కథే ఉదాహరణ..

సగం ధరకే.. కొనడానికి ముందుకు రావడం లేదు..

నేను ఒక ముఖ్యమైన ప్రాంతంలో లేఔట్ చేయాలని భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టా ను. చాలా మంది ఇన్వెస్టర్ల వద్ద అడ్వాన్సులుకూడా తీసుకున్నాను. ఇప్పుడు ఆ ప్రా జెక్టు మధ్యలోనే అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టును పూర్తిచేసే పరిస్థితులు కనుచూపుమేరలో కనపడటం లేదు. రెం డేండ్ల క్రితం ధరతో పోల్చితే.. సగం ధరకైనా అమ్ముదామంటే ఒక్కరూ కొనేందుకు ము ందుకు రావడం లేదు. దీనికితోడు క్షేత్రస్థాయిలో అధికారుల వ్యవహారం.. న్యాయం చె య్యాలంటూ వెళితే స్థానిక ఎమ్మెల్యే ‘డిమాండ్’.. వెరసి నా బతుకు బస్టాండ్ అయ్యే లా ఉంది.

కొర్రీలపై కొర్రీలు..

నేను సిద్ధపడ్డ లేఔట్‌కు అనుమతుల కో సం అధికారుల వద్దకు వెళ్ళాను. అయితే పక్కనే చిన్న నాలా ఉందని అడ్డంకి వేసిన సదరు అధికారి.. అనుమతి ఇవ్వడం చాలా కష్టమంటూ చెప్పుకొచ్చారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం నాలా ఉన్నవైపు బఫర్ జోన్‌ను వదిలితే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి. బఫర్ జోన్‌ను వదిలినా.. అధికారులు ససేమిరా అంటూ జాప్యం చేశారు.

ప్రజాప్రతినిధి హుకుం..

అధికారుల ఒత్తిడి భరించలేక.. ఆ స్థాయి లో ఆమ్యామ్యాలు చెల్లించలేక.. న్యాయం చెయ్యాలంటూ స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు వెళితే.. ఒక్కడ మరో బాంబు పేలింది. తనకు పార్టీ ఫండ్‌గా, ఎన్నికల ఖర్చుల కోసం రూ. 25 లక్షలు తక్షణం ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. ఇప్పుడు నా (బిల్డరు) పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్టయ్యింది.

తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజాప్ర తినిధికి ముడుపులు చెల్లించినా.. అధికారులకు చెల్లించాల్సిన మామూలు అలాగే ఉండిపోయింది. వాస్తవానికి గడిచిన కొద్దికాలంగా రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన నేటి పరిస్థితిలో.. లంచం రూపంలోనే.. ప్రాజెక్టు పూర్తికాకుండానే.. అనుమతులు రాకుండానే భారీగా చెల్లించాల్సి రావడం నా ఆర్థిక పరిస్థితిని తల్లకిందులు చేసింది. 

ప్రాజెక్టూ.. నీకో దండం..

ఈ వ్యవహారంతో తీవ్రంగా విసిగివేసారిపోయాను. మరింత పెట్టుబడి పెట్టే ధైర్యం లేదు. ఆర్థిక వనరులూ లేని దుస్థితి ఎదురయ్యింది. నా బాధలను గమనించిన మా కుటుంబ సభ్యులు ప్రాజెక్టును వదులుకోమని, బతికుంటే బలుసాకు తినొచ్చనే ఊరడింపుతో ప్రాజెక్టును మధ్యలోనే వదిలేయా ల్సి వచ్చింది.

భవిష్యత్తులోనైనా పరిస్థితులు మెరుగుపడితే.. చూద్దాం అనే ఆశ మాత్రం ఎక్కడో దూరంగా మినుకు మినుకు మంటూ కనపడుతోంది. కానీ.. నా ఆర్థిక వనరులు, ఇన్వెస్టర్ల నుంచి తెచ్చి పెట్టిన డ బ్బులు.. అధికారులు వ్యవహారశైలితో ఇంకా కొలిక్కిరాని అనుమతులు.. వెరసి.. నా బతు కు బస్టాండ్ అయ్యిందనే దుస్థితి ప్రతిరోజూ నన్ను వెన్ను జలదరించేలా తట్టిలేపుతూనే ఉంది..!

ఇది..త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న..

ఒక బిల్డరు మనోవేదన హైడ్రాతో.. తగ్గిన ఆదాయం..

వాస్తవానికి గతంలో ఆదాయం బాగానే ఉం డేదని, హైడ్రా రావడంతో.. పైస్థాయి అధికారులకు ఎక్కువ మొత్తంలో ఇవ్వాల్సి ఉండటంతో.. సాధారణంగా తీసుకునే ‘ఆమ్యామ్యా’లను గణనీయంగా పెంచినట్టు సదరు అధికారి అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టాడు. పైగా ఈ మధ్య కాలంలో తన  ఆదాయంకూడా తగ్గిందని, ప్రాజెక్టులు చాలా తక్కువగా వస్తున్నాయని, అందుకే తక్కువ ప్రాజెక్టుల నుంచే కావాల్సినంత ఆదాయాన్ని పెంచుకునేలా ధరను పెంచామని చెప్పడంతో రియల్ ఎస్టేట్ రంగం పరి స్థితి నా కండ్లముందు ద్రుగ్గోచరమయ్యింది.

150 శాతం పెరిగిన లంచం..

ఇదంతా ఏంటని అధికారిని నిలదీస్తే.. రూ.25 లక్షలు ఇస్తే అనుమతులు వస్తాయని అసలు విష యం చెప్పాడు. ఇందుకు ఒప్పుకుంటే పని అయిన తరువాత కొంత డిస్కౌంట్‌కూడా ఇస్తానం టూ అధికారులు చెప్పడం గమనార్హం. కానీ బిల్డర్‌గా భవిష్యత్తును వెతుక్కుంటు న్న నేను.. గత ప్రభుత్వం లో నడిచినట్టుగానే రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పాను. దీనికి సదరు అధికారి ఇచ్చిన సమాధానంతో నా తల గిర్రున తిరిగింది.