08-07-2025 12:40:42 AM
- ఉద్యోగుల అనుభవం ఆధారంగా జీతం
- 5 ఏళ్లలోపు అనుభవముంటే 47 వేలు.. 8 ఏళ్లలోపు 70 వేలు
- అన్ని మెట్రో నగరాల కంటే ముందంజ
- జాతీయ సగటు కంటే అధిక వృద్ధి
- ఇండీడ్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి) : ప్రపంచ సాంకేతిక రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ నగరం నిలుస్తున్నది. అంతర్జాతీయ కంపెనీల ఏర్పాటుకు అనుకూలమైన సదుపాయాలను కల్పిస్తున్న నగరం, ఉద్యోగుల వేత నాల చెల్లింపుల్లోనూ అత్యుత్తమ గమ్యస్థానంగా మారింది.
ప్రస్తుతం దేశంలో ఐటీ రంగంలో వేతనాల చెల్లింపు ప్రక్రియలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. కొత్తవారు మొదలుకొని కొన్నేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులు సైతం సంతృప్తికరమైన వేతనాలు పొందుతున్నారు. అయితే అనుభవం ఆధారంగా ఐటీ ఉద్యోగులు తగిన వేతనాలు అందుకుంటున్నారు. తద్వారా నిరుద్యోగుల నుంచి అనుభవం ఉన్న ఉద్యోగుల వరకు అందరిని హైదరాబాద్ ఐటీ రంగం ఆకర్షిస్తున్నది.
ఈ కారణంగా మానవ వనరుల లభ్యత పుష్కలంగా లభిస్తుండటంతో అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. ఒకవైపు కంపెనీల ఏర్పాటు, మరోవైపు అత్యుత్త మ వేతన చెల్లింపులతో దేశంలోని అన్ని మెట్రో నగరాలకు ఆదర్శంగా హైదరాబా ద్ నగరం నిలుస్తున్నది. ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా ఆయా మెట్రో నగరాల్లో వేతనాల చెల్లింపు స్థితిగతులపై చేపట్టిన సర్వేలో హైదరాబాద్ ముందంజలో ఉన్నట్టు ఇండీడ్ నివేదిక స్పష్టం చేసింది.
హైదరాబాదే ముందంజ..
సాధారణంగా ఐటీ ఉద్యోగులు అనుభవానికి తగిన వేతనం అందుకుంటారు. అయితే ఇండీడ్ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం రెండేళ్లలోపు అనుభవం ఉన్న ఉద్యోగులకు చెన్నైలో అత్యధికంగా రూ. 30వేల నెలవారీ సగటు జీతం లభిస్తుండగా, తర్వాత హైదరాబాద్‌లోనే అధి కంగా రూ. 28,500 సగటు వేతనం పొందుతున్నారు.
రూ. 28 వేలతో బెంగళూరు, రూ. 27,300లతో అహ్మదా బాద్, రూ. 26,300లతో చంఢీగఢ్, ఢిల్లీ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 2 నుంచి 5 ఏళ్లలోపు అనుభవం ఉన్న ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో హైదరాబాద్ నగరమే అగ్రభాగాన నిలిచింది. హైదరాబాద్‌లో ఉద్యోగులు నెలవారీగా రూ. 47,200 సగటు వేతనాన్ని పొందుతుండగా, చెన్నైలో రూ. 46,600, అహ్మదాబాద్‌లో రూ. 46,200, బెంగళూరులో రూ. 46 వేలు, చంఢీగఢ్‌లో రూ.45,500, ఢిల్లీలో రూ.43,600 సగటు వేతనం పొందుతున్నారు. 5 నుంచి 8 ఏళ్లలోపు అనుభవం ఉన్న ఉద్యోగుల్లో కూడా హైదరాబాద్ నగరంలోనే అత్యధికంగా సగటు వేతనాలు పొందుతున్నారు.
హైదరాబాద్‌లో నెలకు రూ. 69,700 సగ టు వేతనాన్ని ఉద్యోగులు పొందుతుండగా, అహ్మదాబాద్‌లో రూ.69వేలు, చంఢీఘర్ లో రూ.68,400, బెంగళూరులో రూ. 67,100, చెన్నైలో రూ.66,400, ఢిల్లీలో రూ.64,400 సగటు వేతనం పొందుతున్నా రు. అనుభవం ఉన్నవారు ఉద్యోగాల్లో ఇక్కడ స్థిరపడేందుకు, ఫ్రెషర్స్ తమ మొదటి ఎంపికగా నగరం వైపు చూస్తున్నారు.
ఇతర నగరాల్లో అసంతృప్తి..
ఐటీ ఉద్యోగులు తాము ఉద్యోగం చేసే ప్రాంతా న్ని ఎంచుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వారు పొందుతున్న వేతనంతోపాటు జీవన వ్యయం.. రెండు సమ తుల్యంగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకున్న తర్వాతనే ఉద్యోగంలో చేరు తున్నారు. తక్కువ జీవన వ్యయం ఉన్న నగరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
వాస్తవానికి వేతనాలు పెరుగుతున్నప్పటికీ జీవన వ్యయం కూడా పెరుగుతుంటంతో ఆర్థికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది. తాము ఉద్యోగం చేస్తున్న నగరాల్లో జీవన వ్యయానికి తగిన వేతనం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో ఢిల్లీలో అధిక ఖర్చులున్నాయని, జీవన వ్యయానికి వేత నం సరిపోవడం లేదని 96 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్టు తేలిం ది.
ముంబైలో 95 శాతం మంది, పూణేలో 94 శాతం మంది, బెంగళూరులో 93 శాతం మంది ఉద్యోగులు జీవన వ్యయానికి, వేతనానికి సమతుల్యత లేదని పేర్కొన్నట్టు నివేదిక ద్వారా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా వం టి నగరాల్లో జీవన వ్యయం తక్కువగా ఉండటంతో ఆదాయం, రోజువారీ ఖర్చుల మధ్య మెరుగైన సమతుల్యత లభిస్తుందని ఉద్యోగుల అభిప్రాయపడుతున్నట్టు నివేదికలో తేలింది.
జాతీయ సగటు కంటే అధిక వృద్ధి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్ వంటి నగరాలు అభివృద్ధి కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఆయా రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆద ర్శంగా మారుతున్నాయి. ముఖ్యంగా వేతనాల చెల్లింపుల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తూ ఐటీ రంగంలో దిక్సూచిగా నిలుస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు సగటు వేతనాల పొందడంలో 15 శాతం వృద్ధి సాధిస్తే హైద రా బాద్ వంటి నగరంలో మాత్రం జాతీయ సగటుకు మించి వృద్ధిని కనబడుతుందని నివేదిక వెల్లడించింది. అయితే హైదరాబాద్ నగరంలో కేవలం చెల్లింపుల్లోనే కాకుండా ఇతర అంశాల్లోనూ ఉద్యోగుల ప్రాధాన్యత నగరంగా నిలుస్తుంది. ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన జీవన వ్యయం హైదరాబాద్ అత్యల్పంగా ఉండటంతో అధిక శాతం హైదరాబాద్ వైపు మొగ్గుచూపుతున్నారు.