30-04-2025 08:31:22 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): అసంఘటిత కార్మికులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజు కోరారు. భవిష్యత్తు అవసరాల కోసం ప్రతి కార్మికుడు విధిగా ఈ-శ్రమ్ వెబ్ సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ పరిధిలోని విజయనగర్ కాలనీలో బుధవారం అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
భవన, ఇతర నిర్మాణ కార్మికులకు ఐతే ప్రమాదవశాస్తూ మరణం సంభవిస్తే ఆరు లక్షల 30 వేల రూపాయల వరకు వస్తాయని దీనికి ఎఫ్ఐఆర్ నమోదు, పోస్టుమార్టం తదితర కాపీలు కలిగి ఉండాలని తెలిపారు. ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందితే సదరం క్యాంపు సర్టిఫికేట్ పర్సంటేజ్ ప్రకారం ఇన్సూరెన్స్ వస్తుందని సహజ మరణం జరిగినట్లయితే కార్మిక శాఖ ద్వారా రూ.1,30,000, అంతేకాకుండా ఇద్దరు పిల్లలుగాను ఉన్నట్లయితే వారికి ఇరువురుకు వివాహం, ప్రసూతి కాన్పు సహాయం 30000 రూపాయలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేస్ పాక నరసింహారావు బిట్ర సాయిబాబా, రావులపల్లి ఈశ్వరయ్య, లక్ష్మి రాజు రాము సాయి తదితరులు పాల్గొన్నారు.