calender_icon.png 10 August, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్‌ 2 గేట్లు ఎత్తివేత..

10-08-2025 09:35:17 AM

పర్యాటకులకు గుడ్ న్యూస్: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత

భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ మళ్లీ పోటెత్తింది..

సాగర్ 2 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు విడుదల చేస్తున్నారు..

నాగార్జునసాగర్ (విజయక్రాంతి): నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్ట్(Nagarjuna Sagar Project)కు మరోసారి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు కొన్ని క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దాటికి… వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు… ముందుజాగ్రత్తగా నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా తొణికసలాడుతుండడతో ఆదివారం రాత్రి మళ్లీ సాగ‌ర్ డ్యామ్‌ 2 క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని కిందికి పంపిస్తున్నారు. నాగార్జున సాగ‌ర్ జ‌లాశ‌యానికి వ‌ర‌ద కొన‌సాగుతూనే ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 60,522 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 60,522 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్ర‌మంలో సాగ‌ర్ 2 క్ర‌స్ట్ గేట్లు ఎత్తి దిగువ‌కు 16,200 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు. జ‌లాశ‌యం గ‌రిష్ఠ నీటిమ‌ట్టం 590 అడుగులు కాగా, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 590 అడుగులు. గ‌రిష్ఠ నీటినిల్వ 312.0405 టీంఎసీలు కాగా, ప్ర‌స్తుత నీటి నిల్వ 312.0405 టీఎంసీలు.