10-08-2025 09:37:13 AM
తూప్రాన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని ప్రతి కుటుంబంలో అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్లకు రాఖీలు కట్టి దీవెనలు పొందే ఆనవాయితీ కాలానుకూలంగా బ్రహ్మాండంగా కొనసాగుతోంది. ముఖ్యంగా మానవ సంబంధాలు విచ్ఛిన్నమై పోతున్న ఈ సమయంలో రాఖీ బంధన్ రక్త సంబంధీకుల మధ్య ప్రేమానురాగాలను ఆప్యాయతలను పెంపొందింపజేసే పండుగలలో ప్రాముఖ్యమైన పండుగ రక్షాబంధన్. ఈ పండుగ సందర్భంగా తూప్రాన్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు బోల్లంపల్లి బాబుల్ రెడ్డి(BRS President Bollampalli Babul Reddy) వీరి స్వగృహంలో అక్కలు సహోదరునికి రాఖి కట్టి ఆశీర్వాదాలను అందించారు.