calender_icon.png 10 August, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం

10-08-2025 01:47:20 AM

  1. రోడ్లపై ట్రాఫిక్ జామ్

లోతట్టు ప్రాంతాలు జలమయం

13, 14, 15న అతి భారీ వర్షాలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో శని వారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో వర్షం కురిసింది. నగరంలోని అబిడ్స్, కోఠి, మలక్‌పేట్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, రాజేంద్రనగర్, ఎల్బీన్‌గర్, వనస్థలిపు రం, పెద్దఅంబర్‌పేట, అబ్దులాపూర్‌మెట్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సంతోష్‌నగర్, చంపాపేట్, నాగోల్, మన్సూరాబాద్, బీఎన్‌రెడ్డి నగర్, రామంతాపూర్, ఉప్పల్, ముషీ రాబాద్, చిక్కడపల్లి,

బాగ్‌లింగంపల్లి, సికింద్రాబాద్, తార్నాక, బేగంపేట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, మియాపూర్, కూకట్‌పల్లి, బంజారహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, భాగ్యల త, హయత్‌నగర్, సంతోష్‌నగర్, బోడుప్పల్, మేడిపల్లి, ముషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

పెద్దఅంబర్‌పేట నుంచి ఎల్బీనగర్ వైపు రోడ్డుపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జాం అయింది. హైదరాబా ద్‌విజయవాడ రహదారిపై వరద నీరు ప్రవహించింది. భాగ్యలత వద్ద రోడ్డుపై నీరు నిల్వడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. సైదరాబాద్ రెడ్డి కాలనీలో రోడ్లపైకి నీరు నిలిచింది. వరద నీరు నిల్వడంతో ఇళ్ల నుం చి బయటకు వచ్చేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

రాబోయే రోజుల్లో భారీ వర్షాలు

ఈ నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అంచనా వేసింది. 13న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో, 14, 15 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాగా ఆదివారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, మంచిర్యాల, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబా ద్,

నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూ బాబాద్, వరంగల్, హనుమకొండ, జన గాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ నాగర్‌కర్నూలు, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కాగా ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.