calender_icon.png 22 May, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లచెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

22-05-2025 12:00:00 AM

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి మే 21(విజయక్రాంతి): రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నల్లచెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం జిహెచ్‌ఎంసి, హైడ్రా, వాటర్ వరక్స్ అధికారులతో కలిసి నల్లచెరువును పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నల్లచెరువును సుందరీకరించడంలో భాగంగా ఇప్పటికే నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రానున్న వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యను దృష్టిలో ఉంచుకొని పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.

అదేవిధంగా రిటర్నింగ్ వాలు నిర్మించి నీటిని దిగువకు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను పూర్తిచేసి చెరువు సుందరీ కరణ చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు డిఈ నాగరాజు, చిన్నారెడ్డి, నిఖిల్ రెడ్డి, నాగ ప్రియ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.