calender_icon.png 22 May, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని సౌకర్యాలతో కూరగాయల మార్కెట్ నిర్మిస్తా

22-05-2025 12:02:32 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి, మే21(విజయ క్రాంతి) పెద్దపల్లి పట్టణంలో  ప ట్టణంలోని జండా చౌరస్తా వద్ద గల కూరగాయల మార్కెట్ ను అన్ని సౌకర్యాలతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మె ల్యే  చింతకుంట విజయరమణ రావు అన్నారు.

బుధవారం  కూ రగాయల మార్కెట్ ను మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మున్సిపల్ అధికారులు అలాగే హోల్ సెల్  రిటైల్ దుకాణ యజమానులతో సమావేశమై పనులకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు.అనంతరం మార్కెట్ మొత్తం ఎమ్మెల్యే  స్థానిక నాయకులతో కలిసి కలియ తిరిగారు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.4 కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నూతన కూరగాయల మార్కెట్ నిర్మించడం జరుగుతుందని,  మార్కెట్ లోని హొల్ సెల్, రిటైల్, మటన్, చికెన్ చేపల  వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నూతన అన్ని సౌకర్యాలతో నూతన మార్కెట్ నిర్మిస్తామన్నారు. అందుకు సంబంధించిన టెండర్ కూడా 15 నుండి 20 రోజులోపల పిలవడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారులు వినయ్, కిరణ్, మున్సిపల్ సిబ్బంది మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు యూత్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.