08-01-2026 05:05:13 PM
సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాష్
పెంచికల్పేట్(విజయక్రాంతి): మండలం మోట్లగూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ సందర్శించి విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు గుణత్మక విద్యను అందించాలని, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్య భోదన చేయాలని తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యక్తి గత పరిశుభ్రత అవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు.