05-01-2026 12:00:00 AM
ముఖ్య వక్త ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ తెలుగు విభాగపతి కసిరెడ్డి వెంకటరెడ్డి
కామారెడ్డి, జనవరి 4 (విజయ క్రాంతి): అన్ని దానాల కంటే విద్యా దానం గొప్పదని ప్రముఖ వక్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ తెలుగు విభాగపతి కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. మనందరం సరస్వతి దేవి శిష్యులమని తెలిపారు. మనం ఇతరులకు సాయం చేసే గుణాన్ని అలవాటు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవాలని తెలిపారు. తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పథకమురి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సరస్వతి శిశు మందిరాల అంటే క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కేవలం సరస్వతి శిశుమందిర్లోనే నేర్పుతారని తెలిపారు. శ్రీ సరస్వతీ శిశు మందిర్ కామారెడ్డి లో పూర్వ విద్యార్థుల - ఆచార్యుల మహాసమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. గురువులను సన్మానించారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి భవిష్యత్తులో ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తీర్మానించారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. పూర్వ విద్యార్థులు తమకు బోధించిన పూర్వాచార్యులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు చూపర్లను ఎంతో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పథకమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ సరస్వతీ శిశు మందిరాలంటే క్రమశిక్షణకు మారుపేరని తెలిపారు. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కేవలం సరస్వతి శిశు మందిర్లోనే నేర్పుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల అధ్యక్షులు శ్యామ్ సుందర్, రెడ్డి గారి హరీస్మారన్ రెడ్డి,కమిటీ సభ్యులు రణజిత్ మోహన్ , సామల గంగారెడ్డి, బొడ్డు శంకర్, ముప్పారపు ఆనంద్, గీ రెడ్డి రాజిరెడ్డి, పూర్వ విద్యార్థులు, పూర్వాచార్యులు పాల్గొన్నారు.