08-01-2026 05:08:43 PM
సర్పంచ్ ఏలేటి ప్రశాంత్ రెడ్డి
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో ఈనెల 11వ తేదీన తలపెట్టిన ఉచిత మెగా వైద్య శిబిరం సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ ఏలేటి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి కార్డియాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, యూరాలజీ, ఆప్తమాలజీ, న్యూరాలజీ, దంత వైద్యుల సేవలు ఉంటాయని అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన అన్నారు. నిజాంబాద్, హైదరాబాద్ వెల్నెస్ సెంటర్ ల నుంచి వైద్యులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు క్యాంపు నిర్వహించబడుతుందని తెలిపారు.