calender_icon.png 9 January, 2026 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిటి పంపకాలలో ఆ రెందుపార్టీలవి డ్రామాలే

08-01-2026 03:56:02 PM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ఫైర్

కరింనగర్,(విజయక్రాంతి): నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లది రాజకీయ డ్రామానేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. నీళ్ల విషయంలో మొదట నుంచి తాను పోరాటం చేశానన్నారు. తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని, రాయలసీమను రత్నాల సీమ చేస్తానని తెలంగాణకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మెడలు వంచింది కేంద్ర బీజేపీ ప్రభుత్వానిదేనని తెలిపారు.

కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏనాడూ కొట్లాడలేదని అన్నారు. ఏపీ విభజన చట్టంలో ఆరు ప్రాజెక్టులకు ఎవరూ అభ్యంతరం తెలపొద్దని ఉందని ప్రస్తావించారు. ఆరు ప్రాజెక్టుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు మరణ శాసనం విభజన చట్టంలోని ఈ అంశమేనని అన్నారు. కేసీఆర్ విభజన చట్టం చదివావా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంపై పదేళ్లు ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.