08-01-2026 02:58:25 PM
- వినూత్న రీతిలో ట్రాఫిక్ పోలీసుల అవగాహన
- హెల్మెట్, సీటు బెల్ట్ ధరించినవారికి గులాబీతో అభినందనలు
సిద్దిపేట క్రైం: ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. రోడ్డు సురక్ష, రహదారి భద్రత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా ఆయనతోపాటు ట్రాఫిక్ ఎస్ఐలు విజయభాస్కర్, ఉమేష్, సిబ్బందితో కలిసి సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆర్కే టెడ్డీ ఈవెంట్స్ వారితో వినూత్న రీతిలో అవగాహన కల్పించారు.
హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు గులాబీ పువ్వును అందించి అభినందించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి రక్షణ పొందాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి వాహనాలు నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు విజయ భాస్కర్, గోపాల్ రెడ్డి, ఉమేష్, మల్లేశం, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి, మోహన్, కానిస్టేబుల్ శ్రీనివాస్, అఖిల్ ఆర్కే టెడ్డి ఈవెంట్స్ ఆర్గనైజర్ పరశురాములు, పాల్గొన్నారు.