14 July, 2026 | 5:10 PM

Breaking News

లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా నరహరి లక్ష్మారెడ్డి

26-06-2025 08:19 PM

కొత్తపల్లి: రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా నరహరి లక్ష్మారెడ్డి ఎన్నిక్కయ్యారు. కార్యదర్శిగా  బండ కిషన్ రెడ్డి, మొదటి ఉపాధ్యక్షులుగా చాడ మల్లారెడ్డి, కోశాధికారిగా ఠాకూర్ వందన సింగ్ గురువారం కరీంనగర్ లోని వేడుక మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఇన్స్టాలేషన్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఫాస్ట్ గవర్నర్, మల్టిపుల్ కౌన్సిల్ చైర్ పర్సన్ రాజిరెడ్డి పీఎంజేఫ్ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రీజినల్ చైర్ పర్సన్ కొల్లూరు జితేందర్, జోన్ చైర్ పర్సన్, సిరిపురం ప్రసాద్ ,పాత కార్యవర్గం వేల్పుల శశికళ, చందుపట్ల ఉమాదేవి, వందన సింగ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మార్కెటింగ్ చైర్మన్, సభ్యత్వ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.