calender_icon.png 8 December, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిదానపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం

08-12-2025 07:19:51 PM

చిట్యాల (విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామనికి చెందిన సర్పంచ్ ఏకగ్రీవం కాబడి, గ్రామస్థుల ఐక్యత, నాయకత్వంపై నమ్మకం మరోసారి రుజువైంది. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిదానపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా కట్టగురి మల్లయ్యను సర్పంచిగా ఎన్నుకుని రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు అదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ, తెలంగాణ ఏర్పాటుకు తర్వాత జరిగిన 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో నారపాక మాధవి యాదయ్యను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామంలోని 8 వార్డులపై ఒక్క సవాలు కూడా లేకుండా అభ్యర్థులు ఏకగ్రీవంగా అవ్వడం, ప్రజల ఏకాభిప్రాయం, గ్రామాభివృద్ధిపై ఎదుగుతున్న అవగాహనకు ప్రతీకగా స్థానికులు పేర్కొంటున్నారు. ఉప సర్పంచ్ పదవి కూడా ఏకగ్రీవంగానే భర్తీ కావడం పంచాయతీ రాజకీయాల్లో అరుదైన సంఘటనగా స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. గ్రామం మొత్తం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. పెద్దలు, యువత, మహిళలు కలిసి గ్రామ ఐక్యత కోసం చూపిన తీరును నాయకులు ప్రశంసించారు. నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తామని కొత్త సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య హామీ ఇచ్చారు. నిదానపల్లి గ్రామం మరోసారి ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.