calender_icon.png 15 September, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణరావుపేటలో అత్యధిక వర్షపాతం

15-09-2025 09:25:50 AM

హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో భారీ వర్షాలు పడ్డాయి. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేటలో అత్యధికంగా 245.5 మి.మీ వర్షపాతం(Highest Rainfall) నమోదైందని తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం తెలిపింది. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్‌లో 128 మి.మీ, హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో 124 మి.మీ, ముషీరాబాద్‌లోని ఎంసిహెచ్ కాలనీ లైబ్రరీలో 119 మి.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో 114.5 మి.మీ, కామారెడ్డి జిల్లాలోని సోమూర్‌లో 108.8 మి.మీ వర్షపాతం నమోదైంది. 

మేడ్చల్-మల్కాజ్‌గిరిలోని కాప్రాలో 103.3 మి.మీ, హైదరాబాద్ మారేడ్‌పల్లి(Hyderabad Marredpally) మండలంలోని న్యూ మెట్టుగూడ ప్రాథమిక పాఠశాలలో 101.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నిజామాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటలోని అనేక ఇతర ప్రాంతాలలో 80 మి.మీ నుండి 100 మి.మీ వరకు వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి జోరుగా వర్షం కురిసంది. బోడుప్పల్‌, పీర్జాదిగూడ, పోచారం, నారపల్లిలో వర్షం. బషీర్‌బాగ్‌, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, ఎంజే మార్కెట్‌, బేగం బజార్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌ నగర్‌, అబ్దుల్లాపూర్‌ మెట్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మణికొండ, గచ్చిబౌలి,  హిమాయత్‌నగర్‌, వనస్థలిపురంలో వాన దంచికొట్టింది. దోమలగూడ, చిక్కడపల్లి, గాంధీనగర్‌లో పలు కాలనీలు నీటమునిగాయి. ముషీరాబాద్‌ వినోద్‌నగర్‌లో నాలాలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పోలీసులు, హైడ్రా బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.