11 June, 2026 | 3:23 AM

2047 వరకు నరేంద్ర మోదీయే ప్రధాని

11-06-2026 02:37 AM

భారత్‌ను విశ్వగురుగా నిలబెడతారు

25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ 

కరీంనగర్, జూన్ 10 (విజయక్రాంతి): నరేంద్రమోదీ 2047 వరకుప్రధానమంత్రిగా కొనసాగుతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. భారత్‌ను విశ్వగురు స్థానంలో నిలబెట్టే వరకు మోదీ విశ్రమించబోరని చెప్పారు.

భారత ప్రధానిగా 4398 రోజులు పూర్తి చేసుకుని పండి ట్ జవహార్ లాల్ నెహ్రూ రికార్డును మోదీ బద్దలు కొట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అభి వృద్ధిలో భారత్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న మోదీకి భగ వంతుడి ఆశీస్సులు అందించాలని కోరుతూ బండి సంజయ్ ఈ పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మా ట్లాడుతూ దేశ ప్రధానిగా 4,398 రోజులు ప్ర ధానిగా పూర్తి చేసుకుని జవహార్ లాల్ నెహ్రూ రికార్డును బద్దలు కొట్టారన్నారు. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేశారన్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామి నేషన్ పత్రాలను తిరస్కరించిన వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోనిదని, ఈ అంశా న్ని ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని బండి సంజయ్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.