calender_icon.png 21 January, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య కార్మికులపట్ల ఉదారత చాటిన నరేష్ గౌడ్

21-01-2026 12:00:00 AM

వెల్గటూర్,జనవరి20(విజయక్రాంతి):పారిశుద్ధ్య కార్మికులపట్ల వెల్గటూర్ మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకు లు,భక్తాoజనేయ ఆలయ కమిటీ ఛైర్మెన్ మేరుగు నరేష్ గౌడ్ ఉదారత చాటారు. వెల్గటూర్ మండల కేంద్రంలో విధులు నిర్వహి స్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నిత్యం ఉపయోగపడే చేతి గ్లౌజ్ లను మంగళవారం ఆ యన అందజేశారు.

ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మ రువలేనివనీ, ప్రతీ గ్రామపౌరుడు వారికి ఋణపడి ఉండాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు నిస్వార్ధ సేవకులనీ, గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం పరితపిస్తుంటారనీ అభివర్ణించారు.వారికి తమవంతుగా సేవ చేయ డం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పే ర్కొన్నారు.తమ సేవలను గుర్తించి చేతి గ్లౌజ్ లను అందించినందుకు పారిశుద్ధ్య కార్మికులు మేరుగు నరేష్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మూగల శేఖర్, కార్మికులు గాజుల రాజయ్య, ఎనగందుల లక్ష్మణ్ చిలుకయ్య,రాజు లు పాల్గొన్నారు.