calender_icon.png 21 January, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానేరులో తోడేళ్లు!

21-01-2026 12:00:00 AM

చల్లురు పై విచారణ

కరీంనగర్, జనవరి20(విజయక్రాంతి): మానేరు లో ఇసుక దందాకు అడ్డులేకుండా పోతున్నది. అనుమతి ఒకచోట ఉంటే.. మ రోచోట నుంచి అక్రమ రవాణా సాగుతున్నది. మానేరు శివారులో ఇసుక తోడేస్తు న్నారు. మానేరువాగులో బావులు తవ్వుకొని దశాబ్దాల తరబడి వాటినే నమ్ముకొని సాగుచేస్తున్న రైతుల పొట్ట కొడుతున్నారు.క నీస సమాచారం ఇవ్వకుండా..

బావులను ఇసుకతో పూడ్చడమేకాదు, మోటర్ల కోసం వేసిన స్తంభాలను కూల్చివేసి అదే బావిలో కప్పేస్తున్నారు. వాల్టా చట్టం పేరుతో విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారు.మానేరు పరి వాహకంలో జరుగుతున్న కూల్చివేతలు, చెక్ డ్యామ్ ల కూల్చి వేతల పై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇది ఇలా ఉంటే..

మానేరు వాగు నుండి ఇసుకాసురులు కొత్త కొత్త పద్ధతుల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. పంథా మార్చిన ఇసుక మాఫియాకరీంనగర్ రూరల్ పోలీసులకు చిక్కడంతో వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ రూరల్ పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు, మూడు బొలెరో వాహనాలను సిజ్ చేశారు.

సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామానికి చెందిన కొందరు.బొలెరో వాహనాలలో మానేరు వాగు నుండి ఇసుకను దొంగలించి అట్టి ఇసుకను దుబారా కు వినియోగించే విధం గా సన్నగా చెరిగి రవాణా చేసేప్పుడు అనుమానం రాకుండా సంచులలో నింపి వేరే ప్రాంతాలలో ఎక్కువ ధరకు అమ్ముతున్న కొత్త పంథా వెలుగులోకి వచ్చింది.

అనుమతించిన లొకేషన్‌లోనే ఇసుక తవ్వకాలు.. విచారణ బృందం నివేదిక

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు పరిధిలోని మానేరు వాగులో ఇసుక క్వారీకి అనుమతి పొంది ఇప్పలపల్లి గ్రామ పరిధిలో ఇసుక తోడుతున్నారన్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు ఆదేశించారు.  ఈ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారణ జరిపి జి ల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించారు.

ఈ ని వేదిక ప్రకారం రేజింగ్ కాంట్రాక్టర్ చల్లూరు పరిధిలో అనుమతి తీసుకుని చల్లూరు పరిధిలోనే ఇసుక తవ్వకాలు జరిపారని, ఎక్కడా అక్రమ మైనింగ్ జరగలేదని విచారణ బృందం పేర్కొంది. డిజిపిఎస్ ద్వారా సర్వే చేయించగా అనుమతి ఉన్న లొకేషన్ లో మాత్రమే మైనింగ్ జరిగిన విషయం నిర్ధారణ అయిందని తెలిపింది.

వ్యవసాయ బావులు, పైప్ లైన్, మోటార్లు తొలగించి దౌర్జన్యంగా ఇసుక తవ్వకాలు జరిపారన్న ఆరోపణలపై కూడా విచారణ బృం దం క్షేత్రస్థాయిలో విచారించగా బావులకు ఎలాంటి అనుమతులూ లేవని, అవన్నీ నదిలోనే (రివర్ బెడ్)ఉన్నాయని, వాల్టా చట్టం ప్రకారం నదిలో బావుల తవ్వకాలకు అనుమతి లేదని విచారణ బృందం పేర్కొంది. 

అదేవిధంగా రేజింగ్ కాంట్రాక్టర్ ఇచ్చిన అనుమతి ప్రకారం మాత్రమే అనుమతించిన లొకేషన్లో అనుమతించిన లోతులోనే తవ్వకాలు జరపాలని, ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.