1 April, 2026 | 2:01 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి మాతృవియోగం

04-10-2025 10:27 PM

వరంగల్/నర్సంపేట (విజయక్రాంతి): వృద్ధాప్య కారణంగా గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ శనివారం సాయంత్రం మృతి చెందినట్టు సమాచారం. తల్లి మృతితో దొంతి మాధవరెడ్డి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాంతమ్మ మృతిపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. కాంతమ్మ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ప్రజలు అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం హనుమకొండలోని పద్మాక్షమ్మ గుట్ట పక్కన గల శివముక్తి ధామ్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.